అష్టాదశ పురాణాలు..!!
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాసభగవానుడు మనకు అందించారు.
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది.
బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహనుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి..
అకా
ఉ.. కార
మ.. కార
శబ్ధాలు కూడిన
ఓం.. కారశబ్దం ఆవిర్భవించింది.
"అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి.
ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది.
5.కారం మండి నాలుగు వేదాలు ఉర లించాయి.......
ఋగ్వేదం.. యజుర్వేదం.. సామవేదం..
అధర్వణవేదం.. అనే చతుర్వేదాలు,
భూ. భువ. సువ. అనే త్రిలోకాలు,
జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి.
ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తన కుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తుసారంతో కూడిన అష్టాదశ పురాణాలను
రచించారు.
పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పారు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన తైయారుణి, కశ్యపుడు, సావర్ణి, లాంటి శిష్యులకు అందించారు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.
ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. .
శ్లో! ! 'మ'ద్వయం 'భ'ద్వయం చైవ, 'బ్ర'త్రయం 'వ'చతుష్టయం !
'అ'నా'ప'లిం'గ' 'కూ''స్కా'నీ, పురాణాని ప్రచక్షత !!
'మ'ద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి
అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం. 1
'భ'ద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి
అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం. 2
'బ్ర'త్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి
అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. 3
'వ'చతుష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి
అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. 4
అ కారంతో అగ్ని పురాణం,
నా కారంతో నారద పురాణం,
ప కార పద్మ పురాణం,
లి కారంతో లింగ పురాణం,
గ కారంతో గరుడ పురాణం,
కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.